TIME

About

Profile

Monday 12 March 2012

నాలాంటోడ్ని ఎప్పుడూ కెలకొద్దు:ఎన్టీఆర్






స్వరపరిచిన ఈ చిత్రం పాటలను అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత కేఏ వల్లభ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ‘‘రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే విధంగా వస్తోంది. ఇందులోని ఉద్రేకాలు, ఉద్వేగాలు మళ్లీ మళ్లీ అభిమానుల్ని థియేటర్‌కి తీసుకొస్తాయి.
బోయపాటి దర్శకత్వ ఘాటుతో పాటు కీరవాణి సుస్వరాలు, ఆర్థర్ ఎ.విల్సన్ ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అలాగే ఎన్టీఆర్ స్టెప్స్ వండర్ అనిపించేలా ఉంటాయి. ఎన్టీఆర్‌ని ఫోకస్ చేస్తూ అభిమానుల కోసం కీరవాణి ఓ ప్రత్యేక శ్లోకాన్ని స్వరపరిచారు. అది అద్భుతంగా ఉంటుంది. అభిమానులకు వందశాతం ఆనందాన్ని పంచే ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నాం’’ అని ఆయన తెలిపారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, రంగనాథ్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: కేఎస్ రామారావు.

0 comments:

Post a Comment