పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వారి కల రేపు నెరవేరబోతుంది. పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రేపే ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఆఫీసులో ప్రారంభం కానున్న ఈ చిత్ర ముహూర్తానికి పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్ షూటింగ్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రం పూర్తయిన తరువాత పూరి సినిమాలో పాల్గొంటాడు.
0 comments:
Post a Comment