ఇటీవలే ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా పలు ఊహాగానాలు వచ్చాయి. సోమవారంనాడు రామ్ చరణ్ రచ్చ సినిమా షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతోంది. తమన్నాపై పాటను చిత్రీకరిస్తున్నారు. రేపు.. మంగళవారంనాడు రామ్ చరణ్ పుట్టినరోజు. కానీ, ఆరోజు కేరళలోని పొల్లాచ్చిలో షూటింగ్‌కు వెళుతున్నారు. అందుకే సోమవారంనాడు నిర్మాత విఎస్‌ఎన్.ప్రసాద్ సెట్‌లో కేక్ కట్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో చిట్‌చాట్.
రచ్చ సినిమా ఎలా ఉంటుంది?
నేను గతంలో చేసిన కమర్షియల్ సినిమాల కంటే కొత్తగా ఉంటుంది. ఈ కథ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది.
దర్శకుడు సంపత్‌నంది ఒక్క సినిమానే చేశారు. ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించగలిగారు?
సంపత్‌నంది చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఎన్ని సినిమాలు చేశాడు అనేకంటే... కథలోని పాయింట్, చెప్పిన విధానం నచ్చింది.
రచ్చ ఆడియోనాడు కాలికి గాయమైందన్నారు. మరి ఇప్పుడు డాన్స్ ఎలా చేస్తున్నారు?
సినిమా అనుకున్నట్లు పూర్తవ్వాలి. నిర్మాత ఇబ్బంది పడకూడదని... కొన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకుని చేస్తున్నాను.
వాన పాట.. బుద్ధుని విగ్రహం దగ్గర తీయడం వల్ల విమర్శలు వచ్చాయి?
అందులో వల్గారిటీ లేదు. చూస్తే మీకూ తెలుస్తుంది. పాట కూడా బాగా వచ్చింది.
చిరంజీవితో కలిసి నటిస్తారా?
నాకూ ఉంది. పొద్దున్న లేచిన దగ్గరనుంచి.. నాన్నతో కలిసి చేయాలనుకుంటాను. నాన్నగారి 150వ సినిమాలోనైనా చేయాలనుంది. కథ కుదరాలి కదా..
పవన్ కళ్యాణ్ రచ్చ పాటలు విన్నారా?
విన్నారు. ఆడియో ముందు వారం రోజులనాడే నేను బాబాయ్‌ను కలిశాను. పాటలు విన్పించాను. 'వాన వాన..' పాట బాగా నచ్చిందన్నారు. ఆ తర్వాత ఊరెళ్ళిపోయారు.
మగధీరలో.. పంచదార చిలక అన్నారు.. రచ్చలో హీరోయిన్‌తో ఏమంటున్నారు?
రచ్చలో... తెల్ల కోడిపిల్ల.. తెల్లారేపాటికి తల్లవుతావు.. అనే పాట ఉంది. ఇది బాగా వచ్చింది. సన్నివేశపరంగా లిరిక్ ఉంది. ఈ సినిమాలో తమన్నా తెల్లగా కన్పిస్తుంది. ఆమెతో పాటు నేను అలానే కన్పిస్తాను. కెమెరామెన్ సమీర్‌రెడ్డి బాగా చూపించారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఇంత అందంగా ఉన్నానా అనిపించింది.
డాన్స్‌లో బన్నీనా.. మీరా.. ఎవరు బాగా చేస్తారు?
బన్నీనే బాగా చేస్తాడు.
నంది అవార్డులకు మీరు హాజరుకాలేదు. ఏదైనా కారణమా?
ఆ టైమ్‌లో రచ్చ షూటింగ్‌లో దూరంగా ఉన్నాను. అంతకంటే మీరనుకున్నంత ప్రత్యేక కారణం లేదు. అల్లు అరవింద్‌గారు వచ్చి అవార్డు అందుకున్నారుగదా...
ఎన్టీఆర్ కారులో మీరు... ఓపెనింగ్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి నటిస్తారా?
మీమిద్దరం సేమ్ ఇండస్ట్రీ. కొలీగ్స్. మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తాను. ఎన్టీఆర్‌తో కలిసి చేయడానికి సిద్ధం. మంచి కథ దొరికితే ఓకే.
రచ్చ అంటే ఏమిటి?
రచ్చ అంటే... అంతా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
0 comments:
Post a Comment