రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో వరస సినిమాలతో నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫాక్టరీ సైతం రన్ చెయ్యలేక క్లోజ్ చేసేసారు. మరో ప్రక్క పన్నెండేళ్ల తర్వాత తెలుగులోకి వచ్చి అప్పలరాజు,దొంగలముఠా తీసి మెగా డిజాస్టర్స్ ని అందించారు. ఆయన ప్రెజెంట్ చేసిన బెజవాడ రౌడీలు సైతం పెద్ద ప్లాప్ కావటంతో ఆయన ఆర్దికంగా కోలుకోలేని స్ధితికి వచ్చేసారని ముంబై టాక్. ఈ నేపధ్యంలో ఆయన్ను మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ ఆదుకుంది. అప్పటికే తన పరిస్ధితి సైతం బాగోలేని పూరి జగన్నాధ్.. ఆయన ఇచ్చిన బిజినెస్ మ్యాన్ ఐడియాతో నిలదొక్కకుని వరస సినిమాలతో బిజీ అయ్యారు.
దాంతో వర్మకు ఇప్పుడు హిందీ బిజినెస్ మ్యాన్ రైట్స్ ఇప్పించి తను ప్రొడ్యూస్ చేస్తూ సినిమా చేస్తున్నారు. హిందీ బిజినెస్ మ్యాన్ తో తాను కూడా అప్పుల నుంచి బయిటపడతానని వర్మ భావిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ని ఒప్పించుకుని ఈ ప్రాజెక్టుని కైవసం చేసుకున్నారు. మరో ప్రక్క మహేష్ బాబు చేసిన ఒక్కడు సినిమా రైట్స్ ని ఆయన హిందీకి తీసుకున్నాడు. దాన్ని రానాతో రీమేక్ చేయటానకి ప్లాన్ చేస్తున్నాడు. ఆ రకంగానూ ఆయన మహేష్ సినిమాతో మరోమారు లబ్డి పొందుతున్నాడు. అయితే మహేష్ మాత్రం డేట్స్ ఇచ్చే అవకాసం లేదని తెలుస్తోంది.
0 comments:
Post a Comment