పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ప్రారంభం రోజు నుంచి ఏదో ఒక విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కర్ణాటక బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. కర్ణాటక ఏరియాకు ఎన్నడూ లేని విధంగా నాలుగు కోట్లు పైగా పలికిందని విశ్వసనీయ సమాచారం. అక్కడ డబ్బింగ్ చేయకుండా డైరక్ట్ రిలీజ్ ఉంటుంది. అయినా ఆ రేంజి రేటు పలకటం కర్ణాటక సినీ వర్గాలని సైతం ఆశ్చర్యంలో పడేసింది. కన్నడ గబ్బర్ సింగ్ టైటిల్.. గబ్బరో సింగో. ఇక గబ్బర్ సింగ్ బెంగుళూరు, ఆంధ్రా సరిహద్దు కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువ థియేటర్స్ విడుదల చేయాలని, అక్కడ మంచి మార్కెట్ అవుతుందని ఈ రేటు ఇచ్చినట్లు చెప్తున్నారు.
ఇక శాటిలైట్ నిమిత్తం వచ్చిన ఆరు కోట్లు, కర్ణాటక రైట్స్ నాలుగు కోట్లు కలిపితే దాదాపు పదికోట్లు వరకూ ఇక్కడికే రావటంతో నిర్మాత ఫుల్ ఖుషీగా ఉన్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment