లెక్కలను వెల్లడించింది. ఆ పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం టాలీవుడ్‌కు సంబంధించి వసూళ్ల పరంగా నెం.1 సినిమా రామ్ చరణ్ తేజ్ నటించిన ‘మగధీర’. ఈ చిత్రం రూ. 110 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది.
దేశం మొత్తంగా తీసుకుంటే 1994లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘హమ్ ఆప్ హై కౌన్’ చిత్రం రూ. 300 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ చిత్రం రూ. 275 కోట్లతో రెండో స్థానంలో, రజనీ ‘రోబో’ రూ. 250 కోట్లతో మూడో స్థానంలో, సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రం రూ. 190 కోట్లతో నాలుగవ స్థానంలో, అమీర్ ఖాన్ ‘గజినీ’ చిత్రం రూ. 160 కోట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఇక వీటి తర్వాత రూ. 110 కోట్లతో ‘మగధీర’ చిత్రం ఆరవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
దేశంలో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల వివరాలకొస్తే...రూ. 70 కోట్లతో షారుఖ్ మొదటి స్థానంలో, రూ. 60 కోట్లతో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ రెండో స్థానంలో, రూ. 50 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో రూ. 30 కోట్లతో రజనీకాంత్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
0 comments:
Post a Comment