‘బద్రి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన భామ అమీషా పటేల్. అయితే ఆమె నటించిన ‘నాని’ చిత్రం పరాజయం పాలవ్వడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం బాలయ్య సరసన పరమవీర చక్రలో నటించినా ఆ సినిమా ప్లాపయింది. బాలీవుడ్‌లో కూడా అమీషా పరిస్థితి ఏమంత బాగోలేదు. కథానాయికగా రేసులో వెనకబడ్డ ఈ భామ నిర్మాతగా అవతారమెత్తి అక్కడా పరాజయాన్ని చవిచూసింది.
సుదీర్ఘ కాలం తర్వాత భారీ చిత్రం ‘రేస్ 2’లో నటిస్తోంది అమీషా. పదేళ్ల క్రితం వచ్చిన సంచలన చిత్రం ‘రేస్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తన సత్తాను చూపించి తిరిగి బాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తోంది ఈ భామ. ఇందుకో అందాల ప్రదర్శననే ఎంచుకుంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మతో పాటు దీపికా పదుకునే, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరిని మించి సినిమాలో ఎక్కువ గుర్తింపు పొందాలనే తాపత్రయంతో ఉన్న అమీషా ఈ చిత్రంలో టూపీస్ బికినీలో అందాల కనువిందు చేయాలని నిర్ణయించుకుంది.
ఈ విషయమై అమీషా స్పందిస్తూ ‘కథానుగుణంగానే ఈ చిత్రంలో బికినీ ధరించాల్సివచ్చింది. అశ్లీలతకు తావులేకుండా అందాల్ని ప్రదర్శించడంలో తప్పులేదని నా అభిప్రాయం. గతంలో ‘తోడా ప్యార్ తోడా మ్యాజిక్’ చిత్రంలో కూడా ఈ తరహా బికినీ ధరించాను’ అని చెప్పింది. చిత్ర దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్‌లు బికినీ సీన్ గురించి చెప్పిన వెంటనే ఈ సుందరి తన ఐపాడ్ ఫోన్‌లో వున్న బికినీ ఫోటో షూట్‌ను వారికి చూపించి అబ్బురపరిచిందట.
0 comments:
Post a Comment