skip to main |
skip to sidebar
11:43
nikhil cherry
పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే 'కెమెరా మేన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగు నిన్న హైదరాబాదులో లాంచనంగా ప్రారంభమైంది. అయితే, ఇందులో గంగగా నటించే కథానాయిక ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే వుంది. మొదట్లో కాజల్ ఎంపికైందన్న వార్తలొచ్చినా, ఆ తర్వాత అనుష్క పేరును కూడా పరిశీలిస్తున్నారన్న టాక్ వచ్చింది. గంగ పాత్ర కేవలం గ్లామరే కాకుండా అభినయాన్ని కూడా ప్రదర్శించాల్సిన అవసరం వున్నది కావడంతో, నయనతారను కూడా సంప్రదించారట. అయితే, ఆమె పారితోషికం ఎక్కువ కావడం వల్ల, ప్రస్తుతం కృతి కర్బందాను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గతంలో 'తీన్ మార్' సినిమాలో పవన్ పక్కన కృతి నటించిన సంగతి మనకు తెలిసిందే. ఏదేమైనా, త్వరలోనే మన రాంబాబు ప్రియురాలు గంగ ఎవరన్నది తెలిసిపోతుంది!
0 comments:
Post a Comment