సంప్రదాయ బద్దంగా చీరకట్టులో ఉంటనే చరణ్ ఇష్ట పడతాడని, అతని ఇష్ట ప్రకారమే తాను నడుచుకుంటానని...అతనికి కాబోయే భార్య ఉపాసన కామినేని చెప్పుకొచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఓ షాపు ఓపెనింగులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇద్దరి ఇష్టాలు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయని, ఆరెంజ్, గ్రీన్, రెడ్ కలర్ సారీలంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించింది. చాలా కాలం తర్వాత ఉపాసన మీడియాకు తారస పడటంతో ఆమెతో మాట్లాడించడానికి మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు.
చిన్న నాటి స్నేహితులైన రామ్ చరణ్-ఉపాసన మధ్య గత ఐదేళ్లుగా నడుస్తున్న ప్రేమాయణం చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వచ్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్లో వీరి నిశ్చితార్థ వేడుక పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. జూన్ 13న వీరి వివాహం జరుగుతుందని ఉపసాన తాతయ్య అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సి రెడ్డి కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు
0 comments:
Post a Comment