మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాబోతున్న చిత్రం “రచ్చ”లో అద్బుతమయిన డాన్స్ లతో అభిమానులను అలరించబోతున్నారు. ఈ చిత్రం లో డాన్స్ ల కోసం చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని కష్టపడి మరీ చేశారు అయన కష్టం తెర మీద కనిపిస్తుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 25 నుండి జరగబోయే పాట చిత్రీకరణ లో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఇప్పటికే సగం చిత్రీకరణ అయిపోయిన ఈ పాటకు జాని మాస్టర్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు మిగిలిన సగం పాట ఈ నెల 25 నుండి చిత్రీకరణ జరుపుతారు. ఇది కాకుండా చిత్రం లో మరో పాట మిగిలి ఉంది ఆ పాటను ఈ నెల 27 నుండి చిత్రీకరిస్తారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్నా ప్రధాన పాత్రలో కనిపించబోయే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
0 comments:
Post a Comment