నితిన్ కు చాలా గ్యాప్ తర్వాత హిట్ తెచ్చిపెట్టిన చిత్రం ఇష్క్ . నిత్యామీనన్ కాంబినేషన్ లో విక్రమ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో హిందీ హీరో రణబీర్ కపూర్ చేసే అవకాశముందని బాలీవుడ్ సమాచారం. ఇప్పటికే విక్రమ్ కుమార్ ..ఈ చిత్రం షోని రణబీర్ కు చూపించాడని తెలుస్తోంది. ఇక గతంలోనూ విక్రమ్ కుమార్ హిందిలో మాధవన్ తో 13బి చిత్రం రూపొందించి హిట్ కొట్టారు. ఇక మరో ప్రక్క ఇష్క్ డైరక్టర్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది.
నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఇలా మూడు తరాలువాళ్లతో కలిపి చేయబోయే చిత్రానికి విక్రమ్ ని దర్శకుడుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఇష్క్... వసూళ్లు పరంగా కాస్త సన్నగిల్లినా మంచి టాక్ తెచ్చుకోవటం నితిన్ కి బాగా ప్లస్ అయ్యింది.
0 comments:
Post a Comment