ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ద చిత్రాలు దమ్ము, రచ్చ, గబ్బర్ సింగ్, ఈగ. ఈ చిత్రాలు విడుదల తేదీలు ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం...
రచ్చ: ఆ చిత్రం ఆడియో మార్చి 9 విడుదలైంది. ఏప్రియల్ 5న విడుదల తేదీ ప్రకటించారు. అయితే రామ్ చరణ్ కి దెబ్బ తగలటంతో డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం అనుకున్న తేదీకి విడుదల చేస్తారో లేదో చూడాలి. సంపత్ నంది రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
దమ్ము: ఈ చిత్రం ఆడియోని మార్చి 23 న విడుదల చేయనున్నారు. అలాగే సినిమాని ఏప్రియల్ 19న భారీగా విడుదల చేస్తున్నారు. సింహా వంటి ఘన విజయం సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. త్రిష,కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
గబ్బర్ సింగ్ : ఈ చిత్రం ఆడియోని ఏప్రియల్ 15 న విడుదల చేయనున్నారు. అలాగే చిత్రం విడుదలని మే 9 న ఎట్టి పరిస్ధితుల్లోనూ విడుదల చేయాలని నిర్మాత గణేష్ బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనపించనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే మాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఈగ: ఈ చిత్రం ఆడియో ఈ నెల 30న విడుదల కానుంది. ఇక చిత్రాన్ని ఏప్రియల్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా సిజి వర్క్ పూర్తికాకపోవటంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాసం ఉంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని,సమంత జంటగా నటిస్తున్నారు. ఈగ ప్రదానపాత్రలో కనపించే ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా ఉంటుందని సమ్మర్ లో పెద్ద చిత్రాలకు పోటీ ఇస్తుందని చెప్తున్నారు.
ఇక పైన చెప్పిన ఆడియో,సినిమా విడుదల తేదీలు ఆ దర్శక,నిర్మాతలు స్వయంగా ప్రకటించినవే. అయితే కారణాంతరాల వల్ల ఆయా తేదీల్లో మార్పు కూడా జరిగే అవకాసం ఉంది.
0 comments:
Post a Comment