పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో ఆడిపాడే ఐటం గర్ల్ ఎట్టకేలకు కన్ ఫర్మ్ అయింది. ఈ ఐటం సాంగు కోసం ఇప్పటి వరకు చాలా మందిని సంప్రదించారు. చివరకు సెక్సీ భామ మలైకా అరోరాని ఖరారు చేశారు. ఈవిషయాన్ని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కన్‌ఫర్మ్ చేశారు. గబ్బర్ సింగ్ చిత్రానికి ఒరిజినల్ వర్షన్ అయిన ‘దబాంగ్’ చిత్రంలో మున్ని బదనాం హుయే సాంగులో బాలీవుడ్ ప్రేక్షకుల మతులు పోగొట్టిన మలైకా...తాజాగా పవన్ స్టార్‌తో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల్లోనే వేడి పుట్టించనుంది. గతంలో మలైకా మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో ‘రాత్రైనా, పగలైనా నాకు ఒకే’ అంటూ హాట్ హాట్ అందాలు ఆరబోసింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
0 comments:
Post a Comment