నాకు కొంచె తిక్క ఉంది..కానీ దానికి లెక్క ఉంది’అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తూ వదిలిన గబ్బర్ సింగ్ ప్రోమో ఈ మధ్యన అబిమానులకు హాట్ ఫేవెరెట్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజమౌళి ట్విట్టర్ లో...నేను గతంలో ఏం జరిగింది అనే దాన్ని ఎప్పుడూ ఎస్టిమేట్ వెయ్యను...అది పాజిటివ్ అయినా..నెగిటివ్ అయినా..హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఎక్సప్లాయిట్ చేసే కాపబుల్ ఉందని మాత్రం చెప్పగలను అంటూ ట్వీట్ చేసారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందం నింపింది. ఇక గబ్బర్ సింగ్ చిత్రం బిజినెస్ కూడా బాగా జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే‘గబ్బర్ సింగ్’ శాటిలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ రూ. 6 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment