ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'అందం' చిత్రం కోసం నానా తంటాలుపడుతున్నాడు. దగ్గుబాటి రానాను, నథాలియా కౌర్‌ల జంటగా "అందం" చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం యాక్షన్, లవ్‌స్టోరీతో ఉంటుంది. షూటింగ్ మొత్తం విదేశాల్లో ఇంతవరకూ చూడనటువంటి అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేయనున్నారు.
దీనిపై వర్మ మాట్లాడుతూ.. ఇంతవరకు నా సినిమాల్లో మురికివాడలు, ఇరుకు సందులు, చీకటి ఇళ్ళనే లొకేషన్స్‌గా ఎంచుకునేవాణ్ణి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా మొట్టమొదటిసారిగా అత్యంతమైన అందమైన లొకేషన్లలో అందమైన భామ మధ్యలో చిత్రాన్ని రూపొందిస్తున్నానని. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ప్రకటనలో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment