త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇలియానా - అల్లు అర్జున్ నాయికా నాయకులుగా ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోవుంది. ఈ సినిమాకి సంబంధించిన వాయిస్ ఓవర్ ని మహేష్ బాబు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ తో ఉన్నస్నేహం కారణంగానే మహేష్ బాబు ఇందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాన్ తో త్రివిక్రమ్ చేసిన 'జల్సా' చిత్రానికి కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ సినిమా విజయాన్ని సాధించడంతో, అదే సెంటిమెంట్ ని ఇప్పుడు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇటు మహేష్ అభిమానులకీ ... అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తున్నట్టు చెబుతున్నారు. ఏదేవైనా, ఇంతటి స్టార్ డం ఉన్న మహేష్ బాబు ఫ్రెండ్ షిప్ కి విలువనిచ్చి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడాన్ని అభినందించకుండా ఉండలేం!
1 comments:
Good news i like this blog
Post a Comment