వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంశం నేపథ్యంలో పలువురు యువకులు ఆత్మ బలిదానాలు పాల్పడుతున్న తరుణంలో ఆయన తన ట్విట్టర్లో భిన్నంగా స్పందించారు. ‘‘ఆత్మహత్యలు చేసుకునే బదులు హత్యలు చేయరెందుకు?’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే వర్మ ఇటు తెలంగాణ జోలికి కానీ, సమైక్యాంధ్ర జోలికి కానీ పోకుండా ఈ వ్యాఖ్యలు చేయడం వెనక....కేవలం పబ్లిసిటీ స్టంటే అని అంతా చర్చించుకుంటున్నారు. ఏ సంఘటన జరిగినా తన పేరు మారుమ్రోగిపోవాలని తహతహలాడే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. మరి ఈ వ్యాఖ్యలపై ఎవరి స్పందన ఎలా ఉంటుందో..? చూడాలి.
0 comments:
Post a Comment