ఆమధ్య సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' సినిమాతో టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మేజిక్ ఏమిటన్నది బాలీవుడ్ కి కూడా అర్ధమైంది. అతని పాప్యులర్ నంబర్ 'రింగా రింగా' ను ఆ సినిమాలో ఉపయోగించుకోవడంతో దేవిశ్రీ అక్కడ కూడా ఎంతో పాప్యులర్ అయ్యాడు. ఆ తర్వాత తమ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించమంటూ బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు కూడా అతనికి వచ్చాయి. అయితే, ఆయన వెంటనే వేటినీ ఒప్పుకోలేదు. ఓ మంచి సినిమా ద్వారా ఎంట్రీ కోసం ఎదురుచూశాడు. ఈ నేపథ్యంలో తాజాగా దేవిశ్రీ ఓ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అదే రామ్ చరణ్ హిందీలో నటించే 'జంజీర్' రీమేక్! ఈ సినిమా ద్వారా తన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఎక్స్ పోజర్ బాగుంటుందన్న ఉద్దేశంతో దేవిశ్రీ దీనికి అంగీకారం తెలిపాడట. ఈ సినిమా అటు చరణ్ కూ, ఇటు తనకూ కూడా బాలీవుడ్ లో తొలి చిత్రమే కాబట్టి, ఓ చాలెంజ్ తో మ్యూజిక్ చేయడానికి, మనవాడు తన సంగీత పరికరాలకు సాన పెడుతున్నాడట. అందుకే... మనం కూడా దేవిశ్రీకి ఆల్ ది బెస్ట్ చెబుదాం!
0 comments:
Post a Comment