TIME

About

Profile

Thursday, 15 March 2012

Nagarjuna with chinaranjeevi








చిరంజీవి త్రి పాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు చిత్రం గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం టైటిల్ ని చిరకాలం గ్యాప్ తర్వాత నాగార్జున వినియోగించనున్నారని సమాచారం. అయితే నాగార్జున త్రిపాత్రాభినయం చేసే చిత్రం కాదది. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, తను నటించే చిత్రానికి ఆ టైటిల్ ని పరిగిణస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం గత కొంత కాలంగా నలుగుతోంది. అయితే నిన్నే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో అనుకున్న ఈ ప్రాజెక్టు అప్పుడు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు నాగార్జున ఈ చిత్రం వచ్చే సంవత్సరం చేయనున్నట్లు ప్రకటించారు.


నెల్లూరు వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం నేను షిర్డీ సాయిబాబా చిత్రం చేస్తున్నాను. ఆ తర్వాత దశరధ్ చిత్రం ఉంటుంది. ఈ రెండు చిత్రాల తర్వాత మా నాన్నగారు, మా అబ్బాయి, నేను కలిసి నటించే చిత్రం చేస్తాను. వచ్చే సంవత్సరం ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సినిమా కోసం స్క్రిప్టులు వింటున్నాము అన్నారు. ఇక అప్పట్లో కృష్ణవంసీ చేసిన స్క్రిప్టు నచ్చక ఆ ప్రాజెక్టుని రిజెక్టు చేసారు. ప్రస్తుతం ఇష్క్ డైరక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన ఓ స్క్రిప్టు ఓకే అయ్యిందని, ఈ ప్రాజెక్టు అతని దర్శకత్వంలోనే ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి ముగ్గురు మొనగాళ్లు.. మూడు తరాల అభిమానులను ధియోటర్లలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారన్నమాట.

0 comments:

Post a Comment